telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

చిరుకు 1 మిలియన్ ఫాలోవర్స్…!

రాజకీయాలు వదిలి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాక మెగాస్టార్ చిరంజీవి మరింత ఫామ్‌లో కనిపిస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు ఎంచుకుంటూ మరింత డిఫరెంట్‌గా స్క్రీన్ ప్రెజెన్స్ ఇస్తున్నారు. ఆ తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని వరుస ప్రాజెక్ట్స్ లైన్‌లో పెట్టారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ మూవీ చేస్తున్నారు చిరంజీవి. ఇటీవలే ‘సైరా నరసింహా రెడ్డి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఎప్పటికప్పుడు డిఫరెంట్ లుక్స్‌తో ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ క్రమంలోనే నిన్న (గురువారం) గుండుతో దర్శనమిచ్చి సర్‌ప్రైజ్ చేశారు. దీంతో ఈ లుక్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. కాగా ఇన్‌స్టాగ్రామ్‌లో 1 మిలియన్‌ ఫాలోవర్స్ ను సాధించి మరోసారి టాక్‌ ఆఫ్‌ ద ఇండస్ట్రీగా నిలిచారు. మెగాస్టార్‌ చిరంజీవిని ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతున్న వారి సంఖ్య 1 మిలియన్‌కి చేరింది. ఇప్పటి వరకు ఆయన తన ఇన్‌స్టాగ్రమ్‌లో 51 పోస్టులు చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో చిరు 1 మిలియన్‌ ఫాలోవర్స్‌ని చేరుకోవడంతో అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Related posts