telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

అంబానీ ఇంటికి సమీపంలో పేలుడు పదార్థాల కేసులో కీలక పరిణామాలు…

ముకేష్‌ అంబానీ ఇంటికి సమీపంలో పేలుడు పదార్థాల కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అయితే ఈ కేసు విషయంలో మహా సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. వాహన యజమాని మన్‌సుఖ్‌ హిరేన్‌ మృతిపై దర్యాప్తు జరుపుతోన్న పోలీసు అధికారిపై వేటు వేసింది. దర్యాప్తు పూర్తయ్యే వరకు క్రైం బ్రాంచ్‌ నుంచి తొలగిస్తున్నట్లు మహారాష్ట్ర హోం మంత్రి అనిల్‌ ప్రకటించారు. ఎటువంటి విమర్శలకు తావు లేకుండా ఈ కేసు దర్యాప్తు చేస్తామన్నారు. కేసును దర్యాప్తు చేస్తోన్న పోలీసు అధికారి సచిన్‌ వాజేపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. హిరేన్‌ హత్యలో సచిన్‌ పాత్ర ఉందని ఆరోపిస్తూ.. ఆయనను వెంటనే అరెస్టు చేయాలని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ అసెంబ్లీలో డిమాండ్‌ చేశారు. ఇక, అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలు గల వాహనం కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. పేలుడు పదార్థాలు లభ్యమైన వాహన యజమాని అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోవడంతో ఈ కేసును నేషనల్ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ -ఎన్‌ఐఏకి అప్పగించింది మోడీ సర్కార్‌. కేంద్ర హోం శాఖ ఆదేశాల మేరకు కేసు దర్యాప్తు చేపడుతున్నట్టు ఎన్‌ఐఏ తెలిపింది. అయితే ఇప్పుడు ఈ వార్త వైరల్ గా మారింది.

Related posts