telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ

ఇంటర్ బోర్డు తప్పిదాలకు .. సీఎం రమేష్ మేనల్లుడు మృతి.. !

tdp leader cm ramesh nephew suicide

తాజాగా విడుదలైన ఇంటర్ ఫలితాలు తప్పులతడకలుగా ఉండటంతో విద్యార్థులు చాలా మంది తమ ఫలితాలు తారుమారయ్యాయనే విషయం తెలుసుకోకుండానే, ఫెయిల్ అయినట్టు తెలుసుకొని ఆత్మాహుతికి పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీయం రమేష్ ఇంట విషాదం చోటు చేసుకుంది. రమేష్ మేనల్లుడు ధర్మారామ్ హైదరాబాద్‌లోని శ్రీనగర్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వారు నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్‌లోని ఏడవ ఫ్లోర్ నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తుంది. అంత ఎత్తు నుండి దూకటంతో తీవ్ర గాయాలపాలైన ధర్మారాంను కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించి వైద్యం అందించే ప్రయత్నం చేశారు. చికిత్స పొందుతూ రామ్ మృతి చెందాడు.

ఇంటర్‌లో ఒక సబ్జెక్ట్‌ ఫెయిల్ అయ్యాననే కారణంతో ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నానరు. ధర్మారామ్ నారాయణ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివాడు. ధర్మారామ్‌ మృతదేహానికి గాంధీ ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇప్పటికే తెలంగాణలో ఇంటర్‌ బోర్డు తప్పిదాల వల్ల పలువురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన లు వెలుగు లోకి వస్తున్నాయి. అధికారుల తప్పిదాలు తమ బిడ్డల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఇంటర్‌ బోర్డు ఎదుట ఆందోళనకు దిగారు.

ఈ తప్పిదాలపై ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌ నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు భగ్గుమంటున్నారు. పరీక్షకు హాజరు కాని విద్యార్థిని పాస్‌ చేసిన ఇంటర్‌ బోర్డు అధికారులను ఏం చేయాలంటూ …. విద్యాశాఖ ఎందుకు జోక్యం చేసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 50వేల మంది విద్యార్థులు ఒక్క లెక్కల పరీక్షలోనే ఎందుకు ఫెయిల్‌ అవుతారని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ధర్మారాం విషయంలోనూ బోర్డు ,చేసిన పొరపాటే కారణమా..లేక ఫెయిల్ అయిన విషయాన్ని తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డారా అనే కోణంలో విచారణ జరుగుతోంది.

Related posts