telugu navyamedia
సినిమా వార్తలు

 గ్లోబల్‌ స్టార్ ప్రియాంక చోప్రాకు గాయం…

గ్లోబల్‌ స్టార్ అందాల తార ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండియన్‌ సినిమాను ప్రపంచస్థాయిలో పాపులర్‌ చేస్తున్న నటీనటుల్లో ప్రియాంకా చోప్రా ఒకరు. తన అందం, అద్భుత నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఈ తార ప్రియాంక చోప్రా.. అటు హాలీవుడ్‌లోనూ పలు చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేకగుర్తింపును సంపాదించుకుంది.

Priyanka Chopra says she is destiny's favourite child and proudly ambitious

హాలీవుడ్ కంపోజర్, నటుడు నిక్‌ జోనస్‌ను వివాహం చేసుకున్న తర్వాత‌ లండన్‌లోనే సెటిల్ అయిపోయింది ఈ గ్లోబల్‌ బ్యూటీ.  ప్రియాంక చోప్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ ఎప్ప‌టిక‌ప్ప‌డు త‌న ఫోటోల‌ను అభిమానుల‌తో పంచుకుంటుంది. ఇందులో భాగంగానే షూటింగ్‌ స్పాట్‌లో గాయపడిన ఫోటోలను ఆమె షేర్ చేసింది. యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తునప్పుడు ప్రియాంకకు గాయాలు అయినట్టు సమాచారం. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

Priyanka Chopra injured on set of 'Citadel'

లండన్‌లో జరుగుతోన్న ‘సిటాడెల్‌’ ఎపిసోడ్‌ చిత్రీకరణలో ప్రియాంక గాయపడింది. ఈ విషయాన్ని తానే స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తెలిపింది. ప్రియాంక పోస్ట్‌ చేసిన ఫొటోలలో మొహంపై మొత్తం రక్తం మరకలు ఉన్నాయి. ఇది చూస్తే భారీ గాయమైనట్లు కనిపిస్తోంది. దీంతో ఆమె అభిమానులు కంగారు పడుతూ కామెంట్లు చేశారు.

People are calling out Priyanka Chopra for speaking about #GeorgeFloyd and not minorities in India - Life & Style - Aaj.tv

అయితే ఆ రక్తమంతా మేకప్‌లోనే భాగమని తెలిపిన ప్రియాంక.. ఈ ఫొటోలో రియల్‌ గాయం ఏది.? కానిది ఏది అంటూ పోస్ట్‌ చేసింది. ఇక అనంతరం.. మేకప్‌లో భాగంగా మేకప్‌ చేసిన గాయంతో పాటు, నిజంగా అయిన గాయాన్ని వివరిస్తూ ఫొటోను పోస్ట్‌ చేసింది. షూటింగ్‌లో పాల్గొన్న ప్రియాంక కనుబొమ్మపై చిన్న గాటు పడింది. దీంతో ఆమె ఫ్యాన్స్‌ గాయం ఎలా అయ్యింది అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.

Priyanka Chopra gets hurt during the making of Citadel.

ప్రియాంక చోప్రా త్వరలో ‘సిటాడెల్’ లో కనిపిస్తుంది. దీనితో పాటు ఆమె టామ్ క్రూయిస్ “మిషన్ ఇంపాజిబుల్ 7″లో కూడా నటిస్తోంది. బాలీవుడ్‌లో కత్రినా కైఫ్, అలియా భట్ లతో కలిసి “జీ లే జారా” చిత్రంలో ప్రధాన పాత్రను పోషిస్తోంది.

Related posts