telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు సినిమా వార్తలు

ఎస్వీబీసీ చైర్మన్‌గా పృథ్వీరాజ్‌ నియామకం

Comedian-Prudhvi

ప్రముఖ నటుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత పృథ్వీరాజ్‌ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్‌(ఎస్వీబీసీ) చైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ క్రమంలో ఈనెల 28న ఎస్వీబీసీ చైర్మన్‌, డైరెక్టర్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. తిరుపతిలో శుక్రవారం జరిగిన ఎస్వీబీసీ బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

తిరుమల తిరుపతి దేవస్థానం ప్రజా సంబంధాల అధికారి పృథ్వీరాజ్‌ నియామకానికి సంబంధించిన ప్రకటన విఎస్వీబీసీ బోర్డు విడుదల చేశారు. మరోవైపు టీటీడీ ఎక్స్‌ అఫీషియో సభ్యుడిగా తుడా చైర్మన్‌ నియామకానికి అనుగుణంగా చట్ట సవరణకు కేబినెట్‌ అంగీకారం తెలిపింది.

Related posts