telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సుకుమార్ తో సినిమా.. లేదు : మహేష్ బాబు

mahesh on two projects simultaneously

‘1 నేనొక్కడినే’ చిత్ర చేదు అనుభవం ఇంకా మరిచిపోలేకపోతున్న మహేష్ బాబు.. దీనితో తాజాగా సుకుమార్ చెప్పిన లైన్ బాగుందన్నాడు మహేష్ అని వార్తలు వచ్చిన వెంటనే స్పందించాడు. కొన్ని సృజనాత్మక అంశాల్లో విభేదాలు రావడంతో సుకుమార్ తో సినిమా చేయడం లేదంటూ ట్వీట్ చేశాడు. సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఆర్య సిరీస్ లో మరో చిత్రం పట్టాలెక్కుతున్న నేపథ్యంలో మహేశ్ బాబు ట్వీట్ ప్రాధాన్యత సంతరించుకుంది.

ఆర్య సిరీస్ లో మూడో చిత్రం మహాశివరాత్రి సందర్భంగా అధికారికంగా వెల్లడించారు. ఈ నేపథ్యంలో, సుకుమార్ కు ఆల్ ద బెస్ట్ చెప్పాడు మహేశ్ బాబు. కొత్త ప్రాజక్ట్ ప్రకటించిన సుకుమార్ కు అంతా మంచే జరగాలని ఆశిస్తున్నట్టు పేర్కొన్నాడు. ఓ అద్భుతమైన ఫిలింమేకర్ గా సుకుమార్ ను ఎప్పుడూ గౌరవిస్తానని తెలిపాడు. 1నేనొక్కడినే మూవీ ఎప్పటికీ ఓ కల్ట్ క్లాసిక్ గా మిగిలిపోతుందని, ఆ సినిమాకు పనిచేసిన సమయంలో ప్రతిక్షణం ఎంజాయ్ చేసినట్టు వివరించాడు మహేశ్ బాబు.

Related posts