telugu navyamedia
సినిమా వార్తలు

జగన్ సూపర్ డూపర్ ఒమేగా స్టార్.. బాహుబలిని మించిన బెగ్గింగ్ అంటూ

వివాద‌స్ప‌ద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీలో టికెట్ ధరల వ్యవహారం పై సీఎం జ‌గ‌న్‌తో సినీ ప్రముఖల మీటింగ్ పై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు చేశారు..

గురువారం సినీ ప్రముఖులు చిరంజీవి, ప్రభాస్, మహేష్, రాజమౌళి, కొరటాల శివ తదితరులు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయిన సంగతి తెలిసిందే.

తాజాగా ఈ భేటీపై ఆర్జీవి తన స్టైల్ లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జగన్ ‘రియల్ మెగా సూపర్ డూపర్ ఒమేగా స్టార్’ అని వర్మ అన్నారు. మహేశ్ బాబు, చిరంజీవి, ప్రభాస్ తదితరులు ఒమేగా స్టార్ జగన్ చూట్టూ జూనియర్ ఆర్టిస్టుల్లా కూర్చోవడమే దీనికి ఉదాహరణ అని ట్వీట్ చేశారు ఆర్జీవీ.

రీల్ ఫిల్మ్ లో ఫ్రేమ్ మధ్యలో మహేశ్, చిరంజీవి, ప్రభాస్ తదితరులు పంచ్ డైలాగులు కొడుతుంటారని.. కానీ రియల్ లైఫ్ లో ఫ్రేమ్ మధ్యలో జగన్ ఉన్నారని అన్నారు.జగన్ కు వారంతా భయపడ్డారని, భిక్ష కోసం జూనియర్ ఆర్టిస్టుల్లా బెగ్గింగ్ చేశారని ఎద్దేవా చేశారు ఆర్జీవీ.

అదేవిధంగా మరో ట్వీట్ లో ఏపీ ప్రభుత్వం వర్సెస్ టాలీవుడ్ అన్నట్లుగా ఉన్న పరిస్థితిని అధిగమించి.. భవిష్యత్ లో అంతా సాఫీగా జరిగేందుకు దారిచూపిన ఒమెగాస్టార్ సీఎం జగన్ ను అభినందించాలన్నారు.

సూపర్, మెగా, బాహుబలి స్థాయిలో అడుక్కోవడం వల్లే ఈ సమావేశం జరిగిందని, ఒమెగాస్టార్ సీఎం జగన్ వారందరికీ వరాలిచ్చారని ట్వీట్ లో రాసుకొచ్చారు.

బాహుబలిని మించిన మహాబలి వైఎస్ జగన్ ను చూసి ఆశ్చర్యపోయానని… ఎందుకంటే సూపర్ మెగాస్టార్స్ అందరినీ ‘హీరోలు అందరూ జీరోలు’ గా చేసి ఆయన నిరూపించాడని రాసుకొచ్చారు వర్మ. ఈ ట్వీట్స్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

Related posts