telugu navyamedia
సినిమా వార్తలు

‘రంగ రంగ వైభవంగా’ చిత్రం రిలీజ్ ఎప్పుడంటే..

మెగా హీరో వైష్ణవ్ తేజ్ న‌టించిన తాజా చిత్రం “రంగరంగ వైభవంగా”.. ప్రేమతో కూడుకున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది గిరీశాయ దర్శకత్వం వ‌హిస్తున్న ఈ సినిమాలో రొమాంటిక్’ బ్యూటీ కేతిక శర్మ హీరోయిన్‏గా న‌టిస్తుంది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ టీజర్ మూవీపై ఆసక్తిని క్రియేట్ చేశాయి. తాజాగా ఈ మూవీ నుంచి మరో బిగ్ అప్‌డేట్‌ ఇచ్చారు మేకర్స్‌.

Panja Vaisshnav Tej's next titled Ranga Ranga Vaibhavanga- Cinema express

సమ్మర్ లో ఫ్యామిలీ ప్రేక్షకులకు వినోదాన్ని పంచేలా మే 27వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఈ విశేషం ఏంటంటే.. వైష్ణవ్, కేతికలకు కెరియర్ పరంగా ఇది మూడో సినిమా.

ఈ సందర్భంగా రంగ రంగ వైభవంగా మూవీ నుంచి మరో పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

Related posts