telugu navyamedia
క్రీడలు

బెంగ‌ళూరులో ఐపీఎల్ ఆట‌గాళ్ళ‌ వేలం షూరూ..అమ్ముడుపోయిన ఆటగాళ్లు వీళ్లే..

ప్రపంచంలోనే రిచ్ లీగ్‌గా పేరుగాంచిన ఐపీఎల్‌-15 మెగా వేలం ప్రారంభ‌మైంది. అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2022 మెగా వేలం శనివారం, ఆదివారం.. రెండు రోజులు బెంగళూరులో జరగనుంది.

బెంగళూరు వేదికగా జరుగనున్న ఈ మెగా ఈవెంట్‌లో చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, హైదరాబాద్‌, ఢిల్లీ, ముంబై, పంజాబ్‌, రాజస్తాన్‌ సహా కొత్తగా ఎంట్రీ ఇవ్వనున్న గుజరాత్‌ టైటాన్స్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌ వేలంలో పోటీ పడుతున్నాయి. ఐపీఎల్‌ అతిపెద్ద వేలానికి బెంగళూరు ఆతిథ్యం ఇస్తోంది.

ఐపీఎల్‌ 2022లో అమ్ముడుపోయిన ఆటగాళ్లు వీళ్లే..

* శ్రేయస్​కు రికార్డు ధర..డిల్లీ క్యాపిటల్స్​ ప్లేయర్​ శ్రేయస్​ అయ్యర్​.. రూ. 12.25 కోట్ల రికార్డు ధరకు అమ్ముడయ్యాడు. అతడి కోసం డిల్లీ మళ్లీ పోటీపడినా.. కోల్​కతా నైట్​రైడర్స్​ అతడిని సొంతం చేసుకుంది.

*దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబడను రూ.9.25 కోట్లతో పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది.

*న్యూజిలాండ్ స్టార్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్‌ను రూ.8 కోట్లతో రాజస్తాన్ రాయల్స్ దక్కించుకుంది

*ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్, పేస్ ఆల్‌రౌండర్ ప్యాట్ కమిన్స్‌ను రూ.7.25 కోట్లతో కోల్‌కతా నైట్‌రైడర్స్ దక్కించుకుంది.

*స్పిన్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్‌ను రూ.5 కోట్లతో రాజస్తాన్ రాయల్స్ దక్కించుకుంది.

*డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్‌ను రూ.8.25 కోట్లతో పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది.

* ఆస్ట్రేలియా పేసర్​ ప్యాట్​ కమిన్స్​కు రూ.7.25 కోట్ల‌తో కోల్​కతా నైట్​రైడర్స్​ జట్టే సొంతం చేసుకుంది.

* భారత ఓపెనర్​, దిల్లీ క్యాపిటల్స్​ మాజీ ప్లేయర్​ శిఖర్​ ధావన్ రూ. 8.25 కోట్లతో పంజాబ్​ కింగ్స్​ సొంతం చేసుకుంది.

* షమీ రూ. 6.25 గుజరాత్ టైటాన్ దక్కించుకుంది

 

Related posts