telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఏపీ ప్రత్యేక హోదా పై ఈ నెల 17న తొలి స‌మావేశం..

*ఏపీ విభ‌జ‌న చ‌ట్టంపై త్రిస‌భ్య‌ క‌మిటీ..
* ఈ నెల 17న తొలి స‌మావేశం..
*తొలి స‌మావేశంలో తొమ్మిది అంశాల‌పై చ‌ర్చ‌..
*ఏపీ ప్ర‌త్యేక హోదా ప‌న్ను రాయితీలు..
*ఏపీ తెలంగాణ మ‌ధ్య విద్యుత్ బకాయిల సెటిల్‌మెంట్‌

ఏపీ ప్రత్యేక హోదా పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలను తొలగించే దిశగా ప్రయత్నాలను షూరూ చేసింది.

కేంద్ర హోంశాఖ ఎంజెండాలో ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చారు. ఏపీ ప్రత్యేక హోదా అంశంపై ఈ నెల 17న చర్చలకు రావాలని రాష్ట్రానికి కేంద్ర హోం శాఖ ఆహ్వానం పంపించింది.

ఇటీవల పార్లమెంటు సమావేశాల్లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల పెండింగ్ అంశాల ప‌రిష్కారానికి త్రిసభ్య కమిటీని కేంద్ర హోంశాఖ నియమించింది.తెలుగు రాష్ట్రాల్లో…. ఈ కమిటీలో కేంద్ర హోం శాఖ కార్యదర్శితో పాటు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఇద్దరు సభ్యులుగా ఉంటారు.

ఈ త్రిసభ్య కమిటీ ప్రతి నెల సమావేశమై సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సి ఉంటుంది. ఈ నెల 17వ తేదీన త్రిసభ్య కమిటీ తొలి సమావేశం జరగనుంది. ఈ స‌మావేశంలో తొమ్మిది అంశాల‌పై చ‌ర్చ జ‌ర‌గ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

త్రిస‌భ్య క‌మిటీ కీల‌క అంశాలు ఇవే..

*ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజన,
*బ్యాంక్ బ్యాలన్‌లు,
*డిపాజిట్లు,
*విద్యుత్ పంపిణీ..
*విద్యుత్ బకాయిలు..
*ఆదాయ లోటు..

*ఏపీలో ఉన్న 7 వెనుక బడిన జిల్లాలకు నిధులు,
*ప్రత్యేక హోదా, పన్నుల ప్రోత్సాహకాలు

కాగా..జ‌న‌వ‌రి మొద‌టి వారంలో న‌రేంద్ర‌మోదీని ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ క‌లిశారు. ప్ర‌త్యేక హోదాతో పాటు, విభ‌జ‌న స‌మ‌స్య‌ల‌పై విజ్ఞ‌ప్తి చేసిన విష‌యం తెలిసిందే.

 

Related posts