telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ సినిమా వార్తలు

కళ్ళముందు సల్మాన్ పెళ్ళి ఫోటో… విస్తుపోయిన జడ్జి…!?

Salman

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌ సినిమాలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అన్న విషయం తెలిసిందే. ఇప్పటికి వరకు ఆయన ప్రేమాయణానికి సంబంధించి చాలామంది హీరోయిన్ల పేర్లు విన్పించాయి. కానీ తనకు పెళ్లిపై ఆసక్తి లేదనే విషయం చాలా సందర్భాల్లో ఆయన చెప్పకనే చెప్పారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో సల్మాన్ పెళ్లి ఫొటో వైరల్‌గా మారింది. పైగా ఈ ఫొటోను ఒక వివాదంలో ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ కోర్టుకు ఫిర్యాదుదారు సమర్పించారు. అసలేం జరిగిందంటే… బిలాస్‌పూర్ జిల్లాకు చెందిన పండోపారాకాలరీ గ్రామానికి చెందిన బసంత్‌లాల్‌కు కొంతకాలం క్రితం రాణీ అనే యువతితో వివాహం జరిగింది. అయితే బసంత్‌లాల్ మృతి చెందడంతో రాణిని అత్తింటివారు బయటకు గెంటివేశారు. అలాగే బసంత్ లాల్ పనిచేసిన ఎస్ఈసీఎల్ కంపెనీలో ఆమె దక్కాల్సిన ఉద్యోగాన్ని రాకుండా చేశారు. దీంతో ఈ ఉదంతం వైకుంఠ్‌పూర్ కుటుంబ న్యాయ సలహా కేంద్రానికి చేరింది. అక్కడ రాణి తమ కోడలు కాదని పేర్కొన్న బసంత్ లాల్ తండ్రి… రాణి పెళ్లికి సంబంధించిన ఫొటోను కోర్టుకు చూపాడు. ఈ ఫోటోను చూడగానే అక్కడున్న అధికారులంతా ఆశ్చర్యపోయారు. ఆ ఫోటోలో రాణి పక్కన పెళ్లి దుస్తుల్లో సల్మాన్ ఖాన్ ఉన్నాడు. బసంత్‌లాల్ తండ్రి తమ కుమారుని పెళ్లి నాటి ఫొటోను ఫొటోషాప్‌లో ఎడిట్ చేయించాడు. కుమారుని ముఖచిత్రం ఉన్న చోట సల్మాన్‌ఖాన్ ఫొటో కనిపించేలా చేశాడు. కుటుంబ సలహా కేంద్రంలో వాదనలు విన్న జడ్జి రాణికి మద్దతుగా తీర్పు నిచ్చారు. ఆ పెళ్లి ఫొటో నకిలీదని తేల్చేశారు.

Related posts