“ఫ్యామిలీ మ్యాన్-2” ట్రైలర్ వచ్చేసింది. రాజ్, డికె రూపొందించిన “ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2″లో మనోజ్ బాజ్‌పేయి, సమంతా అక్కినేని, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సిరీస్‌తో సమంత తన డిజిటల్ అరంగేట్రం చేస్తోంది. ఇందులో రాజి అనే శ్రీలంకకు చెందిన తమిళియన్ పాత్రలో నటిస్తోంది సామ్. ప్రేక్షకులకు ఇంకా థ్రిల్ కలిగించే విషయం ఏంటంటే… సామ్ ఇందులో సూసైడ్ బాంబర్ గా కనిపించనుంది. నిన్న ఈ వెబ్ సిరీస్ నుంచి విడుదల చేసిన సామ్ పోస్టర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. ఇక ఈ సిరీస్ జూన్ 4 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంటుందని ట్రైలర్ ద్వారా స్పష్టం చేశారు మేకర్స్. ఇక “ది ఫ్యామిలీ మ్యాన్ 2” ట్రైలర్ లో సామ్ లుక్ కు, నటనకు ప్రశంసలు కురుస్తున్నాయి.
previous post