telugu navyamedia
సినిమా వార్తలు

వీరి వల్లే నేను ఇంకా ప్రాణాలతో ఉన్నాను..

నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత సోషల్ మీడియాలో తెగ‌ ట్రెండ్ అవుతోంది. ఆ బాధ నుండి బ‌య‌ట‌ప‌డడం కోసం ర‌క‌ర‌కాల స‌హ‌సాలు చేస్తోంది. ఇటీవల కాలంలో విహారయాత్రలు, సాహసయాత్రలు అంటూ ప్ర‌ప‌పంచం మొత్తం చుట్టేస్తుంది.

Samantha Marks 'New Beginnings' With Skiing After Divorce from Naga  Chaitanya: 'Leave Your Ego...'

ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లో ఉన్న సామ్‌.. స్కీయింగ్‌ చేస్తూ హాలీడే ట్రిప్‌ను ఎంజాయ్‌ చేస్తోంది. తాజాగా ఇందుకు సంబంధించిన ఫోటోల‌ని, వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానుల‌తో పంచుకుంది. “గతంలో ఎప్పుడూ ఇది ట్రై చేయలేదు. స్కీయింగ్‌ సాహసోపేతమైన క్రీడ‌. అనుకోకుండా ఏదైనా జరిగితే ప్రాణాలను కోల్పోయే ప్రమాదమూ ఉంది. అయినా సరే విజయవంతంగా పూర్తి చేసి ప్రాణాలతో ఉన్నానంటే దానికి కార‌ణం స్కీయింగ్ ట్రైనర్స్‌ కేట్‌, టోనెస్కి వల్లే” అంటూ థ్యాంక్స్‌ చెప్పింది.

Samantha Ruth Prabhu Vacays In Switzerland, Shares Her Thrilling Skiing Experience

ఈ సందర్భంగా సామ్ స్నేహితురాలు సింగర్ చిన్మయి వీటిపై స్పందిస్తూ ‘కమాన్‌ సామ్‌.. ఏదైనా స్కీయింగ్‌ పోటీల్లో పాల్గొని స్వర్ణ పతకం సాధించిరా’ అంటూ సింగర్‌ చిన్మయ్‌ కామెంట్‌ చేశారు

ఇక సినిమాల విషయానికొస్తే.. గుణశేఖర్‌ దర్శకత్వంలో నటించిన ‘శాకుంతలం సినిమా ఇటివ‌లే షూటింగ్ పూర్తి చేసుకుంది.ఈ త్వ‌ర‌లో విడుదల కానుంది. పాన్‌ ఇండియా చిత్రం ‘యశోద’ చిత్రీకరణ దశలో ఉండగా అంతర్జాతీయ సినిమా ‘అరెంజ్‌మెంట్స్‌ ఆఫ్‌ లవ్‌’లోనూ ఆమె కీలకపాత్ర పోషిస్తోంది.

Related posts