telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సరికొత్త రికార్డుతో జోష్ మీద వున్నమహేష్

Mahesh-Babu

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ ఇటీవల సంక్రాంతి కానుకగా విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. మహేష్ బాబు ఈ హిట్‌తో మంచి జోష్‌లో ఉన్నాడు. వరుసగా మూడు విజయాలతో హ్యాట్రిక్ కొట్టారు. ‘భరత్ అనే నేను’, ‘మహర్షి’ సినిమాలతో రెండు వరుస హిట్స్ సొంతం చేసుకున్న మహేష్ తాజాగా ఓ సరికొత్త రికార్డు సొంతం చేసుకున్నాడు. తాజాగా మహేష్‌ ట్విట్టర్‌ ఫాలోవర్ల సంఖ్య 9 మిలియన్లు దాటింది. దీంతో సౌత్‌ ఇండియాలో 9 మిలియన్ల ట్విట్టర్‌ ఫాలోవర్లను సొంతం చేసుకున్న తొలి నటుడిగా మహేష్‌ రికార్డ్ క్రియేట్ చేసాడు. 2010 ఏప్రిల్‌లో ట్విట్టర్‌లో అకౌంట్ ఓపెన్ చేసిన మహేష్ బాబు, అప్పటినుండి ఎప్పటికప్పుడు తన సినిమా, ఫ్యామిలీ విషయాలకు సంబంధించిన అప్ డేట్స్‌ని అభిమానులతో పంచుకుంటున్నాడు. సౌత్ ఇండియన్ సినిమా హిస్టరీలోనే ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్‌లో అత్యధిక మంది ఫాలోవర్లు 9 మిలియన్లు కలిగిన ఏకైక నటుడు మహేషే.

Related posts