కాజల్ గత పన్నెండేళ్ళుగా సినిమాలు చేస్తూ దక్షిణాది సినీ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేస్తోంది. తెలుగుతో పాటు ఇతర సౌత్ ఇండియన్ భాషల్లో భారీ పాపులారిటీ తెచ్చుకోవడమే గాక తనకంటూ లక్షల్లో ఫాలోవర్స్ సంపాదించుకుంది. దాదాపు అందరు అగ్ర హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ ఇటీవలే 50 సినిమాల మార్క్ కూడా దాటేసి హవా సాగిస్తోంది. తేజ దర్శకత్వంలో రూపొందిన ‘లక్ష్మీ కళ్యాణం’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన కాజల్.. ఆ తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘చందమామ’ సినిమాతో అందరికీ మదిలో చిరస్థానం సంపాదించుకుంది. ఆ తర్వాత వరుస ఆఫర్స్ పలకరించి భారీ హిట్స్ ఆమె ఖాతాలో వేశాయి. అయితే తాజాగా కాజల్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించగానే పలువురు ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు. మేడమ్ టుస్సాడ్స్ దక్షిణాది సెలబ్రిటీలకు మైనపు విగ్రహాలు డిజైన్ చేయకపోయినా ఫర్వాలేదు కానీ ఇలా పాడుచేయొద్దంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. మేడమ్ టుస్సాడ్స్‌లో మైనపు విగ్రహాలు ఏర్పాటుచేయడం అంటే మామూలు విషయం కాదు. ఫలానా సెలబ్రిటీ మైనపు విగ్రహాన్ని డిజైన్ చేయాలని అనుకుంటున్నారంటే.. వాళ్లు ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుని ఉండాలి. దక్షిణాది నుంచి మేడమ్ టుస్సాడ్స్‌లో మైనపు విగ్రహాన్ని దక్కించుకున్న తొలి నటి శ్రీదేవి. కానీ ఆమె చనిపోయిన తర్వాత మేడమ్ టుస్సాడ్స్ అతిలోక సుందరి విగ్రహాన్ని రూపొందించడం బాధాకరం. ఆ తర్వాత స్థానం కాజల్‌దే. ఇప్పటివరకు దక్షిణాది నుంచి శ్రీదేవి తర్వాత ఏ నటికీ ఇంతటి అరుదైన గౌరవం దక్కలేదు. సింగపూర్‌లోని మేడమ్ టుస్సాడ్స్‌లో దక్షిణాది నుంచి మైనపు విగ్రహాన్ని దక్కించుకున్న ఏకైక నటుడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. ఆయన నటించిన ‘బాహుబలి’ సినిమా ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ విజయం అందుకోవడంతో ప్రభాస్‌కు ఈ గౌరవం దక్కింది. ప్రభాస్‌ను అందరూ బాహుబలి అనే పిలుస్తారు కాబట్టి బాహుబలి గెటప్‌లోనే మైనపు విగ్రహాన్ని రూపొందించారు. అయితే ఈ మైనపు విగ్రహంపైనా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయనుకోండి. ఆ తర్వాత మైనపు విగ్రహాన్ని సాధించిన హీరో సూపర్‌స్టార్ మహేష్ బాబు. ‘మహర్షి’ సినిమాకు మంచి టాక్ రావడంతో మహేష్‌కు మైనపు విగ్రహం దక్కింది. ఈ విగ్రహాన్ని ఓసారి హైదరాబాద్‌కు కూడా తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
Deeply humbled and ecstatic to be honoured, standing amongst global icons. Feels like I’m seeing
myself through the eyes of an artist 😍 The resemblance is uncanny and the attention to detail is spectacular. pic.twitter.com/WmOz38QBpS— Kajal Aggarwal (@MsKajalAggarwal) February 5, 2020