telugu navyamedia
Uncategorized ట్రెండింగ్ సినిమా వార్తలు

చిరంజీవి ‘పునాదిరాళ్ళు’ దర్శకుడు కన్నుమూత

Chiranjeevi

దర్శకుడు, నిర్మాత రాజ్ కుమార్ కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.ఈ విషయం తెలిసి ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి ఆయనకు అపోలో ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. ఆ మధ్య ఆయన పెద్ద కుమారుడు కూడా అనారోగ్యంతో మృతి చెందడం, ఆ తర్వాత భార్య చనిపోవడంతో రాజ్ కుమార్ ఒంటరివాడు అయ్యాడు.తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో అద్దె ఇంట్లో నివసిస్తూ, అనారోగ్యంతో బాధపడుతూ శనివారం ఉదయం మృతిచెందారు. ఆయన స్వగ్రామం విజయవాడ సమీపంలోని ఉయ్యూరు. ఆయన అంత్యక్రియలు ఉయ్యూరు లో జరపనున్నట్లు రెండవ కుమారుడు తెలిపారు.1979లో వచ్చిన ‘పునాదిరాళ్లు’ సినిమాలో తన సినీ ప్రస్థానం మొదలుపెట్టారు మెగాస్టార్ చిరంజీవి.ఈ సినిమాకు రాజ్ కుమార్ గారు దర్శకత్వం వహించారు.ఈ సినిమా బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో నంది అవార్డు దక్కించుకుంది.ఆ తర్వాత ‘ఈ సమాజం నాకొద్దు, మన ఊరి గాంధీ, మా సిరిమల్లెతో కలిపి దాదాపు ఎనిమిది సినిమాలకు దర్శకుడిగా వ్యవహరించారు

Related posts