telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

లాక్ డౌన్ లో షారుఖ్ కూతురి హాట్ ఫోటోషూట్… స్పెషల్ ఏంటంటే ?

Suhana

కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీంతో సామాన్యులతో సహా సెలెబ్రిటీలు సైతం ఇళ్ళకే పరిమితమయ్యారు. అయితే సెలెబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో చిట్ చాట్ చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో షారూక్ ఖాన్ కూతురు సుహానా ఖాన్‌.. లాక్‌డౌన్ వేళ ఫోటోషూట్‌లో పాల్గొన్న‌ది. ఆ ఫోటోల‌ను త‌ల్లి గౌరీఖాన్ తీయ‌డం విశేషం. చాలా సింపుల్‌గా ఉన్న సుహానా… కొన్ని స్టిల్స్‌తో ఆక‌ట్టుకున్న‌ది. గౌరీ ఖాన్ కూడా ఓ ఫ్రొఫెష‌న‌ల్ త‌ర‌హాలో త‌న కూతుర్ని ఫోటోషూట్ చేసింది. సుహానా త‌న ఫోట‌లోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. గౌరీ ముద్దుల కూతురు సుహానా.. ప్ర‌స్తుతం న్యూయార్క్ వ‌ర్సిటీలో యాక్టింగ్ కోర్సు చ‌దువుతున్న‌ది. ఏడాది క్రిత‌మే ఆమె ఈ కోర్సులో చేరింది. ఇంగ్లండ్‌లోని అర్డింగ్లీ కాలేజీ నుంచి సుహానా త‌న గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేసుకున్న‌ది. క‌చ్చితంగా సినిమాల్లోకి సుహానా ఎంట్రీ ఇస్తుంద‌న్న విష‌యం తాజా ఫోటో షూట్‌తో రుజువైంది. బాలీవుడ్ ప్లాన్స్‌పై ఇంకా సుహానా ఎటువంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. కానీ ఫోటోషూట్‌లో మాత్రం ఆ క్యూటీ చాలా కాన్ఫిడెంట్‌గా కనిపించింది.

 

View this post on Instagram

 

No hair !!!!! No make up !!!! Just my photography!!!!

A post shared by Gauri Khan (@gaurikhan) on

 

View this post on Instagram

 

my mum took these 😋 @gaurikhan

A post shared by Suhana Khan (@suhanakhan2) on

Related posts