telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

చిరు సినిమాలో రామ్ చరణ్ కీలకపాత్ర…!

Chiru-with-Charan

కొరటాల శివ దర్శకత్వంలో నటుడు చిరంజీవి హీరోగా స్టార్ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై రామ్‌చరణ్‌, నిరంజన్ రెడ్డి నిర్మాతలుగా చిరంజీవి 152వ చిత్రం విజయ దశమి రోజున కొరటాల శివ సినిమాకు కొబ్బరికాయ కొట్టాడు. “ఖైదీ నంబర్ 150”, “సైరా నరసింహారెడ్డి” వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల తర్వాత చిరంజీవి హీరోగా, డిఫరెంట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్స్‌తో వరుస బ్లాక్ బస్టర్స్‌ను సొంతం చేసుకున్న దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఈ చిత్రానికి శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తుండగా, తిరు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సురేష్ సెల్వరాజన్ ప్రొడక్షన్ డిజైన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను కొరటాల శివ తనదైన శైలిలో మెసెజ్ ఓరియంటెడ్‌ మూవీగా తెరకెక్కించనున్నట్టు సమాచారం. సైరా మీడియా మీట్‌లో రామ్ చరణ్‌తో కలిసి నటించనున్నట్లు కాస్త క్లూ ఇచ్చారు చిరంజీవి. అయితే లేటెస్ట్‌గా తెలుస్తున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం కొరటాలతో సినిమాలో రామ్ చరణ్ నక్సలైట్ పాత్రలో నటించబోతున్నారట. మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్‌లో 40 నిమిషాలు ఉండే పాత్రను చేస్తున్నారట రామ్ చరణ్. ఆ పాత్రకు సంబంధించి ఓ వార్త ఇప్పుడు లీకయ్యింది. చరణ్ ఇందులో నక్స‌లైట్‌గా కనిపిస్తాడని చెబుతున్నారు. ఇందుకోసం 30రోజుల కాల్షీట్ కూడా రామ్ చరణ్ ఇచ్చేశాడట. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న రామ్ చరణ్ సినిమా షూటింగ్‌ని ఏప్రిల్ వరకు పూర్తి చేసి మే నుంచి కొరటాల సినిమాలో నటించబోతున్నారట.

Related posts