telugu navyamedia
సినిమా వార్తలు

బండ్ల గణేశ్‌ హీరోగా ఎంట్రీ …!

నటుడు, భారీ చిత్రాల నిర్మాత, వ్యాపార వేత్త.. బండ్ల గణేశ్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. తెలుగు ఇండస్ట్రీలో బండ్ల గణేష్‌కు, ఆయన స్పీచ్‌లకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, నిర్మాతగా, చివరకు పొలిటికల్ లీడర్‌గానూ తనదైన ముద్రవేసిన ఆయన త్వరలో కథానాయకుడిగా అలరించేందుకు సిద్ధమయ్యాడు. 

Bandla Ganesh tested positive for Coronavirus - tollywood

తమిళంలో ఘన విజయం సాధించిన క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘ఒత్త సెరుప్పు అళవు7′(సింగిల్‌ స్లిప్పర్‌ సైజ్-7) తెలుగు రీమేక్‌లో బండ్ల నటించనున్నారు. తమిళ్‌లో పార్తిబన్‌ స్వీయ దర్శకత్వంలో నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని సాధించడమే కాకుండా పలు అవార్డులను సొంతం చేసుకుంది. ఒకే ఒక క్యారెక్టర్‌తో సినిమాను తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు పార్తిబన్‌. కాగా ఈ సినిమాను హిందీలో అభిషేక్‌ బచ్చన్‌ రీమేక్‌ చేస్తుడటం గమనార్హం.

వెంకట్ చంద్ర అనే ఒక కొత్త దర్శకుడు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సెప్టెంబరు ఫస్ట్ వీక్ నుంచి ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కానుంది. ఈ సినిమా కోసం బండ్ల గణేష్ అయితేనే హీరో పాత్రకు న్యాయం చేయగలుగుతారని మొదట ఆయనే సంప్రదించడం జరిగింది. ఆయన వెంటనే ఓకే చెప్పడంతో మాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా కోసం ఆయన ప్రత్యేకంగా మేకోవర్ అవుతున్నారు.

Rumour: Bandla Ganesh to become the lead actor?

కాగా బండ్ల గణేశ్‌ ఎంపిక చేసుకున్న సినిమా వార్త తెలుగు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. సెప్టెంబరు మొదటి వారం నుంచి ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కానుంది. .

 

Related posts