మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని చేస్తున్నారు. తన తదుపరి చిత్రాన్ని ఇంతవరకు ఎలాంటి అప్డేట్ లేదు. అయితే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చరణ్ ఓ చిత్రాన్ని చేయనున్నాడంటూ తాజాగా టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. ఇటీవల పూరి, చరణ్ మధ్య ఈ విషయమై చర్చలు జరిగాయనీ, పూరి చెప్పిన కథ చరణ్ కు నచ్చిందని అంటున్నారు. దీనిపై ప్రస్తుతం వర్క్ జరుగుతోందట. దీనిని ప్రముఖ నిర్మాత కె.ఎస్.రామారావు నిర్మిస్తారని తెలుస్తోంది. అసలు చరణ్ ను హీరోగా చిత్రసీమకు పరిచయం చేసింది పూరీనే. ‘చిరుత’ సినిమా ద్వారా చరణ్ ను పూరి పరిచయం చేశాడు.
previous post
next post