సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న చారిత్రాత్మక చిత్రం “సైరా నరసింహారెడ్డి”. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో విడుదల కానున్న “సైరా” చిత్రంలో చిరంజీవి, నయనతార, అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు, తమన్నా ప్రధాన పాత్రలు పోషించారు. భారీ బడ్జెట్ చిత్రంగా సైరా రూపొందగా, ఈ ప్రాజెక్ట్ కోసం 280 కోట్ల బడ్జెట్ ఖర్చయిందని ఇన్‌సైడ్ టాక్. చిరంజీవి రెమ్యునరేషన్ కాకుండా అంత మొత్తం ఖర్చు చేసారని చెబుతుండగా, సినిమా లాభాలలో మెగాస్టార్ వాటా పుచ్చుకుంటాడని అంటున్నారు. ఇప్పటికే చిత్రానికి సంబంధించి ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరగగా, కొణిదెల ప్రొడక్షన్ బేనర్‌పై రామ్ చరణ్ చిత్రాన్ని నిర్మించిన విషయం విదితమే. అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుని విడుదలకు సినిమా సిద్ధంగా ఉంది. దాదాపు రూ.300కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. నిర్మాత రామ్‌చరణ్, తండ్రి చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన సైరా నరసింహారెడ్డిని అన్ కాంప్రమైజ్డ్‌గా నిర్మించారు. ప్రతి సన్నివేశాన్ని ఎంతో రిచ్‌గా చిత్రీకరించారట. ఈ సినిమాలో జాతర సాంగ్ వన్ ఆఫ్ ది హైలైట్‌గా నిలవనుందట. ఈ పాటలో 4500 మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొనగా, 14రోజుల పాటు ఈ పాటను చిత్రీకరించాట. ఇంత మంది ఆర్టిస్టులతో తెరకెక్కించిన పాట ఇదేనని సినీ వర్గాల సమాచారం.
previous post
తలసానితో కలిసి భూములు పంచుకుంటున్నారా ?… : బాలకృష్ణ