telugu navyamedia
వార్తలు వ్యాపార వార్తలు సామాజిక

రెండు పాన్‌ కార్డులు ఉంటే..ఇకపై రూ.10,000 ఫైన్!

pan card it

ఒక వ్యక్తివద్ద ఒకటి కన్నా ఎక్కువ పాన్‌ కార్డులున్నట్లయితే ఇక పై రూ.10,000 ఫైన్ పడనుంది. ఒక వ్యక్తి ఒకే పాన్ నంబర్‌ను కలిగి ఉండాలని ఆదాయపు పన్ను చట్టం-1961 లోని సెక్షన్ 139 ఎ తెలుపుతోంది. దీన్ని అతిక్రమిస్తే జరిమాన వేయాల్సిందేనని అధికారులు నిర్ణయించారు.

కొన్ని ప్రత్యేక కారణాల ద్వారా ఎక్కువ పాన్‌కార్డులను ఉన్నవారు వెంటనే వాటిని అధికారులకు సమర్పించి, జరిమానా నుంచి తప్పించుకునే అవకాశాన్ని ఆదాయపుపన్ను శాఖ కల్పిస్తోంది. ఎన్‌ఆర్‌ఐల ఒకటి కన్నా ఎక్కువ పాన్ కార్డులుండే అవకాశం ఉంది. ఒకటి కన్నా ఎక్కువ పాన్‌ కార్డులు ఉన్నవారు వెంటనే ఐటీ వెబ్‌సైట్‌కు వెళ్లి ‘సరెండర్ డూప్లికేట్ పాన్’ ఆప్షన్‌ క్లిక్ చేసి, అడిగిన వివరాలు పొందుపర్చి అదనంగా ఉన్న పాన్‌ కార్డులను రద్దు చేసుకోవచ్చు.

Related posts