telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“బుట్టబొమ్మ…” సాంగ్ కు స్టెప్పేసిన సీనియర్ హీరోయిన్

Simran

అల్లు అర్జున్ హీరోగా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చి నాన్ బాహుబలి రికార్డులను చెరిపేస్తూ సంచలనం సృష్టించింది ‘అల.. వైకుంఠపురములో’ మూవీ. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో తమన్ బాణీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా ఈ చిత్రంలోని ”రాములో రాములా, బుట్ట బొమ్మా” సాంగ్స్ అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అల్లు అర్జున్- పూజా హెగ్డే స్టెప్స్ ఫిదా చేశాయి. దీంతో పలువురు సెలబ్రిటీలు సైతం ‘బుట్టబొమ్మ’ సాంగ్‌పై హుషారెత్తించే స్టెప్పులేస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ నటి సురేఖావాణి, ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈ పాటపై చిందేయగా.. తాజాగా సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ ఆ లిస్టులో చేరిపోయింది. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటున్న సిమ్రాన్ ‘బుట్టబొమ్మ’ పాటపై డాన్స్ చేసి మురిపించింది. ఈ వీడియోను తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేయడంతో వైరల్ అయింది.

Related posts