telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

మళ్ళీ సమ్మెకు దిగుతున్న .. బ్యాంకులు… 8న బంద్ ..

bank strikes on 22nd october

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక చట్టాలను, బ్యాంకింగ్ సంస్కరణలను వ్యతిరేకిస్తూ.. బ్యాంక్ యూనియన్లు కీలక నిర్ణయం తీసుకున్నాయి. సమ్మెకు దిగుతున్నట్లుగా ప్రకటించాయి. జీతాల పెంపు, ఇతర ప్రయోజనాలను డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగాయి బ్యాంకు యూనియన్లు. సమ్మె ప్రభావం దేశవ్యాప్తంగా బ్యాంకులపై పడనున్నాయి. బ్యాంక్ యూనియన్లు ఇప్పటికే ఈ విషయాన్ని బ్యాంకులకు తెలియజేశాయి. 2020 జనవరి 8వ తేదీన సమ్మె చేస్తున్నట్లు ప్రకటించాయి బ్యాంకు యూనియన్లు. దీంతో ఆరోజు బ్యాంకింగ్ కార్యకలాపాలు స్తంబించనున్నాయి. ఏటీఎం సర్వీసులపై ఈ ప్రభావం ఎక్కువగా పడనుంది. అందువల్ల బ్యాంక్ కస్టమర్లకు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని అంటున్నారు. బ్యాంకు యూనియన్ల నిర్ణయంతో దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సర్వీసులపై ప్రతికూల ప్రభావం పడనుంది. కేవలం బ్యాంక్ ఉద్యోగులు మాత్రమే కాకుండా వివిధ రంగాలకు చెందిన ఉద్యోగులు, వర్కర్లు భారత్ బంద్‌లో పాల్గొనే అవకాశం ఉంది.

ఈ బంద్‌పై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) సమ్మెకు సంబంధించి వివరణ ఇచ్చింది. ప్రతిపాదిత సమ్మె కారణంగా ఎస్‌బీఐ కార్యకలాపాలపై స్వల్పంగానే ప్రభావం ఉంటుందని వెల్లడించింది. బ్యాంక్ స్ట్రైక్‌కు ఆరు యూనియన్లు ఇప్పటికే మద్దతు తెలిపాయి. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ), ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ (ఏఐబీఓఏ), బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఈఎఫ్ఐ), ఇండియన్ నేషనల్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (ఐఎన్‌బీఈఎఫ్), ఇండియన్ నేషనల్ బ్యాంక్ ఆఫీసర్స్ కాంగ్రెస్ (ఐఎన్‌బీఓసీ), బ్యాంక్ కర్మాచారి సేన మహసంఘ్ (బీకేఎస్‌ఎం) యూనియన్లు సమ్మెలో పాల్గొంటాయని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ తెలిపింది.

Related posts