telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

దోమని .. దోమతోనే .. అరికడుతున్న సింగపూర్..

mosquito type finder machine as precaution

ప్రపంచంలో మనిషి దోమను చూస్తే భయపడి వణికిపోతున్నారు. దోమలను తరిమి కొట్టేందుకు ప్రతి మనిషి నెలకు కొంత మొత్తంలో ఖర్చు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రతి ఒక్కరు దోమలను తరిమికొట్టేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. దోమలను తరిమేసి వాటి బారి నుంచి రక్షణ పొందడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దోమకు భయపడటానికి కారణం ఉన్నది. ఒకప్పుడు దోమల వలన మలేరియా, ఫైలేరియా వంటి జబ్బులు వచ్చేవి. కానీ, ఇప్పటి దోమల వలన డెంగ్యూ జబ్బులు వస్తున్నాయి. ఇది మనిషి ప్రాణాలతో చెలగాటం ఆడుతుంది. ఈ జ్వరం వస్తే మనిషి పడే ఇబ్బందులు అన్నీఇన్నీ కాదు. అందుకే దోమలను చూస్తే మనిషి ఆమడదూరం పరుగులు తీస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటె, దోమల నుంచి రక్షణ పొందటానికి దోమతెరలు వంటివి వాడుతున్నాడు. దోమలను తరిమికొట్టే వాళ్ళను చూశాం కానీ, దోమలను పెంచే వాళ్ళను ఎక్కడైనా చూసారా అంటే చూశాం అంటే మాత్రం కిందనుంచి పైదాకా చూస్తారు. వీడెంటి ఇలా మాట్లాడుతున్నారని వెటకారంగా చూస్తారు. ఎందుకంటే, దోమలను ఎవరు పెంచుతారు చెప్పండి. ప్రపంచంలో దోమలను పెంచే దేశం ఒకటి ఉన్నది. అదే సింగపూర్.

అక్కడ దోమల బెడద ఎక్కువగా ఉన్నది. ఈ బెడద నుంచి బయటపడేందుకు నానా కష్టాలు పడుతున్నారు. అందుకే అక్కడి ప్రభుత్వం ఓ ఆలోచన చేసింది. ముల్లును ముల్లుతోనే తీయాలి అనే సామెతగా, దోమను దోమతోనే తరిమి కొట్టాలి అని భావించింది. మాములుగా దోమలు మగదోమలతో సంపర్కం చెంది గుడ్లు పెడతాయి. ఇలా పెట్టిన గుడ్ల నుంచి వచ్చే దోమలు మనపై విరుచుకుపడుతూ ఇబ్బంది పెడుతుంటాయి. కానీ, సింగపూర్ లోని ఈ దోమలు దానికి విరుద్ధంగా చేస్తుంటాయట. మగదోమలు ఆడదోమలతో సంపర్కం చేస్తాయి. కానీ, అవి సంతానోత్పత్తిని చేయలేవు. దీంతో ఆడదోమలు గుడ్లు పెట్టలేవు. అంతేకాదు, ఇలా పెంచే దోమలు మనుషులపై దాడి చేయవట. కనీసం చేయి పెట్టినా కానీ అవి కుట్టవని అంటున్నారు. దీంతో గుడ్లు పెట్టె ఆడదోమల సంఖ్య భారీగా తగ్గిపోయిందని, దీని కారణంగా డెంగ్యూ వంటి వ్యాధులు చాలా వరకు తగ్గిపోయాయని అంటున్నారు. సూపర్ ఐడియా కదా. మనం కూడా ఇలాంటి దోమలను పెంచితే ఎంత బాగుంటుంది.

Related posts