telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

మొక్కజొన్న కొనాలని నిర్ణయించుకున్నాం : హరీష్ రావు

Harish Rao TRS

తెలంగాణ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ఎక్కువగా రైతుల నుంచి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేస్తే.. తాము మేము కొనుగోలు చేయమని తేల్చిచెప్పడం ఎంతవరకు సమంజసమని ఆరోపించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రెండు నాల్కల ధోరణి అవలంబిస్తున్నారు.. సన్నరకం ధాన్యానికి రాష్ట్రప్రభుత్వం ఎక్కువ ధర చెల్లించి కొనుగోలు చేయాలని చెప్పడం ఎంతవరకు కరెక్ట్..? రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని మొక్కజొన్న కొనాలని నిర్ణయించుకున్నాం.. కానీ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం వల్ల మొక్కజొన్న రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బీహార్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలను నుండి మన గజ్వేల్ ప్రాంతాల్లో 11 వందలకు పౌల్ట్రీ ఫామ్ లల్లో అమ్మి పోతున్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయాల వల్లే ఈ ఇబ్బందులన్నారు. గత సంవత్సరం కొన్న మక్కలు గోడౌన్స్ లలో అలాగే ఉన్నాయన్నారు. నిజమైన రైతు బాగుండాలనేది ప్రభుత్వ ఆలోచన అని, జిల్లాలో క్వింటాలుకు 18 వందల మద్దతు ధరతో మొక్కజొన్నలు కొనుగోళ్ళు, 30 కేంద్రాలలో పత్తి కొనుగోలు చేస్తామని హరీష్ రావు అన్నారు. అధికారులు ప్రతి జిన్నింగ్ మిళ్లో పర్యవేక్షణ చేసి కొనుగోళ్లు సజావుగా జరిగేలా చూడలన్నారు.

తేమ శాతం, తూకం మీద రైతు నష్టపోకుండా చూడాల్సిన భాధ్యత వారిదేనన్నారు. 8 శాతం తేమ ఉన్న ప్రత్తికి మద్దతు ధర 5775 రూపాయల ఇస్తామని.. 12 శాతం తేమ ఉంటే రైతులకు మార్కెట్లో ఇబ్బందులు ఎదురవ్వడం జరుగుతుందన్నారు హరీష్ రావు.  కాళేశ్వరం నీళ్లు రావడం వల్ల లక్ష ఎకరాల్లో అదనంగా వరి పంట పండిందన్నారు హరీష్ రావు. జిల్లా మొత్తానికి 420 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసాం.. రూ.1888 మద్దతు ధరకు వడ్ల కొనుగోలు ప్రభుత్వం చేస్తుందన్నారు. సన్న రకం వడ్లకు కూడా ఇదే ధరను ఇచ్చి కొనుగోళ్లు చేస్తామని.. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఎమ్ఎస్పి లేఖను వెనుకకు తీసుకోండి తెలిపారు. ఈ సంవత్సరం తెలంగాణలో 87 లక్షల 84 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం పండింది. ఇలా లేఖలు ఇచ్చేది మీ కేంద్ర ప్రభుత్వమే మళ్ళీ రైతులకు అదనంగా ధర ఇవ్వాలని చెప్పేది మీరే.. విదేశీ దిగుమతి సుంకాన్ని తగ్గించి మొక్కజొన్నలు కొనుగోళ్లు చేసి ఇక్కడి రైతుల నోట్లో మట్టి కొడుతోంది కేంద్ర ప్రభుత్వం అంటూ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేసారు.

Related posts