దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతున్న నేపథ్యంలో ఆర్థిక సంస్థల కార్యకలాపాలను సాధారణ స్థితికి తెచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఆయన ప్రకటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్‌లో స్పందించారు. ఈ రోజు ఆర్‌బీఐ చేసిన ప్రకటనతో దేశంలో ద్రవ్య లభ్యత పెరుగుతుందని, బ్యాంకు రుణాల వృద్ధి పెరుగుతుందని మోదీ అన్నారు.
ఆర్‌బీఐ తీసుకున్న చర్యలు దేశంలోని చిన్న తరహా, ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ, రైతులు, పేదలకు ఉపకరించేలా ఉన్నాయని మోదీ చెప్పారు. రాష్ట్రాలకు ఇచ్చే వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ (డబ్ల్యూఎంఏ)ను కూడా పెంచారని, దీంతో రాష్ట్రాలకు కూడా మేలు చేకూరుతుందని చెప్పారు. శక్తికాంత దాస్ ప్రకటించిన చర్యలు కారణంగా దేశీయ రూపాయి విలువ డాలరు మారకంలో 45 పైసలు పుంజుకుంది. ఆయన ప్రకటన చేయకముందు 76.59 వద్ద ఉన్న రూపాయి మారకం విలువ ఆయన ప్రకటన చేసిన అనంతరం కొద్ది సేపటికే పుంజుకుని 76.42 కి చేరుకొంది.
మాయమాటలతో కేసీఆర్ ఐదేళ్లు పాలన: ఎంపీ కోమటిరెడ్డి