telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ప్రభుత్వ వైఖరిపై ప్రజలకు అనుమానాలు: కన్నా

Kanna laxminarayana

కరోనా ప్రభావం పై ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి వల్ల ప్రజలకు అనేక అనుమానాలు వస్తున్నాయని బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. కోవిడ్-19 విస్తరిస్తున్న నేపథ్యంలో సీఎం జగన్ కు బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వ వైఖరి వల్ల ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు నిజాలు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు.

కరోనాపై శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.రాష్ట్రంలో ఎన్ని టెస్టింగ్ కిట్స్ అందుబాటులో ఉన్నాయో, క్వారంటైన్, ఐసోలేషన్ కేంద్రాల సమాచారం ఇవ్వాలని తెలిపారు. అదే విధంగా ఢిల్లీలోని మర్కజ్ కు వెళ్లొచ్చిన వారిని ఎంత మందిని గుర్తించారన్న వివరాలను తెలియజేయాలని లేఖలో పేర్కొన్నారు.

Related posts