telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కీసర నాగరాజు కేసులో మరో సూసైడ్..

కీసర మాజీ తహసీల్దార్‌ నాగరాజు కేసులో మరో ట్విస్ట్‌ చోటుచేసుకుంది. నకిలీ పాస్‌ పుస్తకాల కేసులో అరెస్టయిన రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్‌ కందాడి ధర్మారెడ్డి ఇవాళ ఆత్మహత్య చేసుకున్నాడు. వాసవీ శివనగర్‌ కాలనీలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇటీవల ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. కీసర మండలం రాంపల్లి దాయర రెవెన్యూ గ్రామ పరిధిలో సర్వే నంబర్‌ 604 నుంచి 614 వరకు గల కోర్టు ఆఫ్‌ వార్డ్స్‌ 53 ఎకరాల భూముల్లోని 28 ఎకరాల భూమిని ధర్మారెడ్డి కుటుంబంతో పాటు మరికొందరి పేరిట నకిలి పాస్‌ పుస్తకాలు జారీ చేసేందుకు తహసీల్దార్‌ నాగరాజుతో ఒప్పందం చేసుకున్నారు. ఈ క్రమంలో ధర్మారెడ్డి నుంచి నాగరాజు రూ. 1.10 కోట్లు లంచం తీసుకుంటూ సెప్టెంబర్‌ లో ఏసీబీ అధికారులకు చిక్కాడు. నకిలీ పట్టా పాస్‌ పుస్తకాల కేసులో ధర్మారెడ్డి, ఆయన కుమారుడుని ఏసీబీ అధికారులు సెప్టెంబర్‌ 29న అరెస్ట్‌ చేశారు. ధర్మారెడ్డి ఇటీవల బెయిల్‌పై విడుదల కాగా..ఆయన కుమారుడు శ్రీకాంత్‌ రెడ్డి జైలులో ఉన్నారు. ఇదే కేసులో తహసీల్దార్‌ నాగరాజు అక్టోబర్ 14న ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Related posts