బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3 తర్వాత రాహుల్ సిప్లిగంజ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. తాజాగా తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఓ పాత వీడియో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఆరేళ్ల కిందట బిగ్‌బాస్-2 భామ నందినీ రాయ్‌తో కలిసి రాహుల్ ఓ ప్రయివేట్ ఆల్బమ్ చేశాడు. ఈ పాటలో నందినీతో రోమాన్స్ చేయడంతో పాటు లిప్ లాక్ సీన్ చేశాడు. నందినీ రాయ్‌తో ఫుల్ రొమాన్స్ చేస్తున్న వీడియోను రాహుల్ తన ఇన్‌స్టాలో తాజాగా పంచుకున్నాడు. ఈ వీడియోలో ఇద్దరు లిప్ టు లిప్ కిస్ ఇస్తున్న సీన్ చూసుకుని నవ్వుకున్న వీడియోని షేర్ చేశారు. ఇక ఈ వీడియోను చూసిన మరో బిగ్‌బాస్ భాం అషూ రెడ్డి చేసిన కామెంట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అషూ స్పందిస్తూ ‘మినిమమ్ ఉంటాయ్ కదా నీ వీడియోస్‌లో’ అంటూ స్మైలీ ఎమోజీ జత చేసింది. ఇక మరికొంత మంది నెటిజన్లు పున్ను ఈ వీడియో చూస్తే రాహుల్ పరిస్థితేంటో అని సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు.
View this post on Instagram
With this pretty lady @nandini.rai #throwbackmemories😍 #enduke #musicvideo #myfavorite