telugu navyamedia
వార్తలు సామాజిక సినిమా వార్తలు

టాలీవుడ్ న‌టుడు శివాజీ రాజాకు గుండెపోటు

shivaji-raja

టాలీవుడ్ సీనియర్ న‌టుడు శివాజీ రాజాకు గుండెపోటు వచ్చింది. నిన్న రాత్రి ఇంట్లో ఉన్న ఆయనకు అకస్మాత్తుగా హార్ట్ స్ట్రోక్ రావడంతో వెంట‌నే కుటుంబ స‌భ్యులు ఆసుప‌త్రికి త‌రలించారు. శివాజీ రాజా ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన తనయుడు విజయ్ రాజా, తన తండ్రికి వైద్యులు స్టంట్ వేయాలని నిర్ణయించారని తెలిపారు.

ప్రస్తుతం తన తండ్రి ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు వెల్లడించారని తెలిపారు. లాక్‌డౌన్ వ‌ల‌న కొద్ది రోజులుగా ఇంటికే ప‌రిమిత‌మైన శివాజీ రాజా..హైద‌రాబాద్ శివార్ల‌లోని త‌న ఫాం హౌజ్‌‌లో వ్య‌వ‌సాయ ప‌నుల్లో నిమ‌గ్న‌మ‌య్యారు. శివాజీరాజాకు గుండెపోటు వచ్చిందన్న విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు ఫోన్లు చేసి పరామర్శించారు. శివాజీ రాజా త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆయ‌న అభిమానులు ప్రార్దిస్తున్నారు.

Related posts