telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

త్వరలో మంచు విష్ణు, శ్రీనువైట్ల కాంబినేషన్‌లో `ఢీ2`… ?

త్వరలో విష్ణు, శ్రీనువైట్ల కాంబినేషన్‌లో `ఢీ2` తెరకెక్కబోతోందంటూ వస్తున్న వార్తల గురించి మంచు విష్ణు స్పందించాడు. వరుస పరాజయాలతో సతమతమవుతున్న శ్రీనువైట్ల తాజాగా `ఢీ2` స్క్రిప్టు సిద్ధం చేశాడని, మంచు విష్ణు హీరోగా త్వరలోనే ఈ సినిమా ప్రారంభమవుతుందని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల గురించి కొందరు సోషల్ మీడియా ద్వారా మంచు విష్ణుని ప్రశ్నించారు. వారికి సమాధానంగా మంచు విష్ణు ఓ ట్వీట్ చేశాడు. `చాలా మంది నాకు ఫోన్ చేసి శ్రీనువైట్ల కాంబినేషన్‌లో `డీ2` స్టార్ అవుతోందట కదా అంటూ నాకు కంగ్రాట్స్ చెప్పారు. దీని గురించి నాకు అన్నలాంటి శ్రీనువైట్లగారిని అడిగితేనే బెటర్. ప్రాజెక్ట్ వివరాలకు సంబంధించినంతవరకు నన్ను ఇన్వాల్వ్ చెయ్యకండి` అంటూ విష్ణు ట్వీట్ చేశాడు.

Related posts