telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం కుట్ర పూరిత వైఖరి…

polavaram

పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం కుట్ర పూరిత వైఖరి అవలంభిస్తోందని విమర్శించారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. కేవలం ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు ఇస్తామని, నిర్వాసితుల విషయం తమకు సంబంధం లేదని చెప్పటం ద్రోహం చేయడమే అన్నారు. సవరించిన అంచనాల ప్రకారం 2019లో రు.47,725 కోట్లకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అంగీకారం తెలిపింది. దేశంలో ఎక్కడైనా ఏ జాతీయ ప్రాజెక్టుకైనా నిర్వాసితుల పునరావాసానికి నిధులు ఇవ్వాలని కేంద్రం మెలిక పెట్టిన దాఖలాలున్నాయా? అని ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా, అమరావతి రాజధాని, ఇప్పుడు పోలవరం అంశాల్లో కేంద్రం తీరని అన్యాయం చేస్తున్నది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు బురద జల్లుకోవడం మాని పోలవరం సాధనకై కలిసికట్టుగా పోరాడాలి అన్నారు. రాజకీయాలకతీతంగా అందరూ కదిలి ఉద్యమానికి సిద్ధం కావాలి అని రామకృష్ణ చెప్పారు.

ఇక ఇదే విషయం పై పోలిట్ బ్యూరో మెంబర్ బోండా ఉమా మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు వైసీపీ అవినీతి ,రివర్స్ పాలనా వల్ల ముందుకు వెళ్ళటం లేదు. చంద్రబాబు హయాంలో 71 శాతం పనులు పూర్తయ్యాయి అది నిజమా,కాదా?వైసీపీ చెప్పాలి అన్నారు. చంద్రబాబు హయాంలో కేంద్రం 55వేల కోట్లు టెక్నికల్ శాంక్షన్ ఇచ్చింది నిజమా, కాదా? చంద్రబాబు హయాంలో పనులు ప్రపంచరికార్డులు సాధించే విధంగా సాగాయినిజం కాదా? అని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం లో జరుగుతున్న అవినీతి వల్లే పోలవరం కి నిధులు కేంద్రం ఇవ్వటం లేదు. గత ప్రభుత్వ హయాంలోపోలవరంలో ఏ అవినీతి జరగలేదని కేంద్రం పార్లమెంటులోనూ చెప్పింది అన్నారు. 22 మంది ఎంపీలు వుండిపోలవరం నిధులు తెలేకపోవటం వైసీపీ అసమర్ధత కాదా అని అడిగారు.

Related posts