telugu navyamedia
రాజకీయ వార్తలు

కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ ఇంటిపై సీబీఐ దాడులు

dk sivakumar arrested by police

అవినీతి ఆరోప‌ణ‌ల కేసులో కాంగ్రెస్ నేత డీకే శివ‌కుమార్ ఇళ్లు, కార్యాలయాలపై సీబీఐ అధికారులు సోదాలు నిర్వ‌హిస్తున్నారు. ఆయన సోదరుడు డీకే సురేష్‌ ఇంట్లో కూడా తనిఖీలు చేస్తున్నారు. క‌ర్నాట‌క‌, ముంబై ప్రాంతాల్లో ఈ సోదాలు జ‌రుగుతున్నాయి. ప‌న్ను ఎగ‌వేత కేసులో ఆదాయ‌ప‌న్ను శాఖ న‌మోదు చేసిన కేసులో సీబీఐ విచార‌ణ చేప‌డుతోంది. మ‌నీల్యాండ‌రింగ్ కేసులో భాగంగా ఈడీ ఇచ్చిన నివేదిక ఆధారంగా సీబీఐ ద‌ర్యాప్తు కొన‌సాగిస్తోంది. గ‌త ఏడాది ఈడీ త‌న సోదా నివేదిక‌ను సీబీఐకి చేర‌వేసింది.

 

మొత్తం 14 స్థానాల్లో సోదాలు జ‌రుగుతున్నాయి. అయితే క‌ర్నాట‌క కాంగ్రెస్ చీఫ్ డీకే శివ‌కుమార్‌ను గ‌త ఏడాది ఈడీ నాలుగు రోజుల పాటు అరెస్టు చేసి ప్ర‌శ్నించింది. మ‌నీల్యాండ‌రింగ్ కేసులో ఆయ‌న్ను విచారించారు. శివ‌కుమార్ వ‌ద్ద అక్ర‌మంగా 8.6 కోట్ల‌ను అధికారులు గుర్తించారు. ఆ త‌ర్వాత ఆ మొత్తాన్ని 11 కోట్ల‌కు పెంచేశారు. 2018లో శివ‌కుమార్‌పై ఈడీ మ‌నీల్యాండ‌రింగ్ కేసును న‌మోదు చేసింది. ఐటీ శాఖ ఫైల్ చేసిన చార్జ్‌షీట్ ఆధారంగా ఈడీ విచార‌ణ మొద‌లుపెట్టింది

Related posts