వివిధ ప్రైవేట్ రంగాల్లో నిరుద్యోగ యువతీ, యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు జిల్లా ఉపాధి కార్యాలయంలో మినీ జాబ్ మేళా నిర్వహించనున్నట్టు ఉపాధి అధికారి ఎన్.మైత్రిప్రియ తెలిపారు. నగరంలోని స్టార్ హాస్పిటల్స్, అపోలో హోమియోకేర్ , నవతరోడ్ ట్రాన్స్‌పోర్ట్, వే సాఫ్ట్ టెక్నాలజీస్, శ్రీరాం చిట్స్ తదితర సంస్థల్లో 400 ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు తెలిపారు.
పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ, ఏఎన్‌ఎం, జీఎన్‌ఎం, బీఎస్సీ నర్సింగ్ చదివిన అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ.10 వేల నుంచి రూ.18 వేల వేతనం చెల్లిస్తారని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు 19న విజయనగర్ కాలనీలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో నిర్వహించే జాబ్‌మేళాకు బయోడేటాతో హాజరుకావాలని, వివరాలకు 8247656356 లో సంప్రదించాలని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వానికి బుద్ధి, జ్ఞానం లేదు: సీపీఐ నేత చాడ