telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

బ్రేకింగ్ : ఈటలను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం..?

తెలంగాణ రాష్ట్రంలో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో మంత్రిగా కొనసాగిన ఈటెల రాజేందర్ ఈ పదవిని అడ్డం పెట్టుకుని రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడినట్లు రాజద్రోహ నేరం మోపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో దేశంలోని రాజ్యాంగం పైన, శాసనాల పైన నమ్మకం ఉంచి, నిర్భయంగా, రాగద్వేషాలకు అతీతంగా, మంత్రిగా పని చేస్తానని ప్రమాణం చేసి దానికి భిన్నంగా మంత్రి పదవి అడ్డుగా పెట్టుకుని అక్రమంగా భూకబ్జాలకు పాల్పడినట్లు రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను క్రోడీకరించి రాజ్యాంగం పై చేసిన ప్రమాణాలను తుంగలోకి తొక్కిన అంశం పై రాజ ద్రోహం కింద కేసులు పెట్టేందుకు పూర్తిస్థాయిలో పరిశీలన చేస్తున్నట్లు సమాచారం. కబ్జా చేసిన కేసు కూడా దీనికి తోడు కావడంతో ఈటల చుట్టూ ఉచ్చు బిగిసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ఏ క్షణమైనా ఈటెలను అరెస్టు చేయవచ్చని చేయవచ్చని తెలుస్తోంది. అయితే ఆయనను ఏ కేసు అంశంపై అరెస్ట్ చేస్తారో ఇంకా క్లారిటీ రాలేదు. ఈటలను అరెస్ట్ చేస్తారన్న వార్తలతో.. ఆయన ఇంటి వద్దకు అభిమానులు చేరుకుంటున్నారు. అటు హుజురాబాద్ లో భారీగా మోహరించారు పోలీసులు.

Related posts