telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

గ్రీన్ జోన్ లో ఈ-కామర్స్ అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్!

petition on amazon and flipkart on plastic usage

దేశవ్యాప్తంగా కేంద్రం లాక్ డౌన్ ను మే 17 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. కేంద్రం ప్రకటించిన రెండో విడత లాక్ డౌన్ మే 3న ముగియనుంది. ఈ నేపథ్యంలో, కేంద్రం మే 4 నుంచి అమల్లోకి వచ్చేలా గ్రీన్ జోన్లు, ఆరెంజ్ జోన్లలో కొన్ని సడలింపులు ప్రకటించింది. ఈ మేరకు సవరించిన మార్గదర్శకాలు జారీ చేసింది.

ఇకపై గ్రీన్ జోన్లు, ఆరెంజ్ జోన్లలో ఈ-కామర్స్ సంస్థలు అన్ని రకాల వస్తువులు విక్రయించుకోవచ్చని తెలిపింది. దేశంలో కరోనా వ్యాప్తి మొదలయ్యాక అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి ఈ-కామర్స్ పోర్టళ్ల ద్వారా కేవలం నిత్యావసరాలనే అనుమతించారు. తమకు అన్ని రకాల వస్తువులు విక్రయించే వెసులుబాటు కల్పించాలని పలు ఈ-కామర్స్ సైట్లు కేంద్రానికి విజ్ఞప్తి చేశాయి. ఈ నేపథ్యంలోనే తాజా నిర్ణయం వెలువడిందని తెలుస్తోంది.

Related posts