telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ అరెస్ట్!

tv9 raviprakash mismatched answers

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. పదిమంది పోలీసులు బృందం రవిప్రకాష్ ఇంటికి వెళ్లి… కారణం చెప్పకుండా అరెస్టు చేసి తీసుకెళ్లింది. బంజారాహిల్స్ ఏసీపీ కేఎస్ రావు రవిప్రకాశ్ ను విచారిస్తున్నారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే అభియోగంతో రవిప్రకాశ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

రవిప్రకాష్‌పై టీవీ9 ప్రస్తుత యాజమాన్యం అలందా మీడియా పలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఫోర్జరీ, తప్పుడు పత్రాల సృష్టి, లోగో విక్రయం, సైబర్‌క్రైమ్‌ నేరాలకు పాల్పడ్డారంటూ బంజారాహిల్స్‌ పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేసింది. ఈ కేసులకు సంబంధించి విచారణకు రవిప్రకాష్ హాజరై.. పోలీసుల ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఈ రోజు అకస్మాత్తుగా పోలీసులు రవిప్రకాష్ ను అదుపులోకి తీసుకున్నారు.

Related posts