telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

భారత్ కు వచ్చిన యూకే కొత్త కరోనా…

Corona

చైనా నుండి వచ్చిన కరోనా మన దేశాన్ని అతలాకుతలం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు భారత్ లోనూ కొత్త కరోనా కలకలం రేపుతోంది. బ్రిటన్ నుంచి మన దేశానికి వచ్చిన వారిలో ఇప్పటిదాకా 8 మందిలో కరోనా లక్షణాలు కనిపించాయి. ఢిల్లీలో అయిదుగురు, కోల్ కతాలో ఇద్దరు, చెన్నైలో ఒకరికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. అయితే.. పాజిటివ్ వచ్చిన వారిలో కొత్త కరోనా లక్షణాలు ఉన్నాయో లేదో తెలుసుకునేందుకు పూణెకు శాంపుల్స్ పంపించారు. ఇక.. వివిధ రాష్ట్రాలు బ్రిటన్ నుంచి వచ్చే వారిపై దృష్టిపెట్టాయి. ఇప్పటికే..  వచ్చిన వారి లెక్కలు తీసేపనిలో ఉన్నాయి.   కరోనా మ్యూటేషన్ తో అప్రమత్తమైన కర్నాటక ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది. ఎయిర్ పోర్టుల్లో కరోనా టెస్టింగ్ సెంటర్లు ప్రారంభించింది. కొద్దిరోజులుగా బ్రిటన్ నుంచి వచ్చిన వారి వివరాలు సేకరిస్తోంది. ఇప్పటిదాకా .. కర్నాటకకు 291 మంది బ్రిటీష్ ఎయిర్‌వేస్‌లో వచ్చారు.  246 మంది ఎయిర్ ఇండియాలో వచ్చారు. అయితే.న. 138 మంది మాత్రం నెగటివ్ నివేదికలతో రాలేదని తెలుస్తోంది. వీరందరినీ వారం రోజుల పాటు హోం క్వారంటైన్‌లోనే ఉంచి నిఘా పెట్టారు. విమానాశ్రయంలో కియోస్క్‌లు అమర్చారు.

Related posts