telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

ప్రజల ఆరోగ్య పరిస్థితిపై ఇంటింటి సర్వే!

Medical Anms

దేశవ్యాప్తంగా కరోనా వ్యాధి చాపాకింద నీరులా విస్తరిస్తున్న నేపథ్యంలో తెలంగాణ సర్కార్ లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ తెలంగాణలో 33 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రజల ఆరోగ్య పరిస్థితిపై నివేదికను తయారు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం మరోమారు ఇంటింటి సర్వేను జరిపించనుంది.

వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 27 వేల మంది ఆశావర్కర్లు, 8 వేల మంది ఏఎంఎలు ఈ సర్వే కోసం పని చేయనున్నారు. కరోనా వ్యాప్తిని నిరోధించడమే లక్ష్యంగా, ప్రతి ఇంట్లో జలుబు, దగ్గు, జ్వరం తదితరాలతో బాధపడుతున్న వారి వివరాలతో వీరు నివేధికను తయారు చేయనున్నారు. లాక్ డౌన్ లో భాగంగా గాంధీ, ఫీవర్, కింగ్ కోఠి, చెస్ట్ ఆసుపత్రుల్లో ఓపీ సేవలను, నాన్ ఎమర్జెన్సీ సర్జరీలను నిలిపివేశారు.

Related posts