మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్ నిరంజన్ రెడ్డి, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ రామ్‌చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రానికి రామ్‌చరణ్ కేవలం బ్యానర్ మాత్రమే ఇస్తున్నాడని, ఒక్క రూపాయి కూడా పెట్టుబడిగా పెట్టడం లేదని మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థే ఈ సినిమాను నిర్మించి వచ్చిన లాభాల్లో వాటాను మాత్రం చెర్రీకి అందిస్తుందని తాజాగా కొన్ని వెబ్‌సైట్లలో వార్తలు వచ్చాయి. ఈ వార్తలు కాస్తా వైరల్ కావడంతో మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థ స్పందించింది. ఆ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేస్తూ.. తమతోపాటు రామ్‌చరణ్ కూడా సమానంగా పెట్టుబడి పెడుతున్నాడని క్లారిటీ ఇచ్చింది.
previous post