telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

పెళ్లి పై కీర్తి సురేష్ స్పందన…

Keerthy

కీర్తీ సురేష్ నటన, అభినయం ప్రదర్శనకు దేశం మొత్తం విస్తుబోయారు. ఈ సినిమా తెలుగు, తమిళ్‌లో భారీ విజయం సాధించింది. అంతేకాకుండా కన్నడ, మలయాళ ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించారు. ఈ సినమాతో దేశమంతటా గుర్తింపుతో పాటు జాతీయ ఉత్తమ నటి అవార్డును కూడా అదుకుంది. అయితే సినిమా అవార్డులు నిన్ని వరించినందుకు సంతోషం.. నువ్వు కూడా ఒక అబ్బాయిని వరిస్తే ఇంకా సంతోషిస్తామని ఆమె తల్లదండ్రులు అంటున్నారట.  ఈ 28ఏళ్ల సుందరి 30దాట కుండానే సంసార జీవితంలో పడాలని ఆమె తల్లిదండ్రులు కోరుకుంటున్నారట. అయితే కీర్తీ మాత్రం వేరే ఆలోచనలు చేస్తుంది. వెండితెరపై తాను ఇంకా ఎంతో సాధించాలని అనుకుంటుందట. పరిశ్రమలో తనను తను ఇంకా నిరూపించుకోవాలన్నది కీర్తీ ఆలోచన. ఇటువంటి సమయంలో పెళ్లి వార్తలు ఇబ్బందికి గురిచేస్తున్నాయని, పేరెంట్స్ మాటను కాదనలేక, లక్ష్యాన్ని వదులుకో లేక సతమతమవుతుంది ఈ అమ్మడు. కీర్తీ లాక్‌డౌన్ టైంలో పెంగ్విన్ సినిమాతో ఓటీటీలో బోణీ చేసింది. ఈ సినిమా అంతగా ఆడకపోయినా, కీర్తీకి మాత్రం ప్రశంసలు వచ్చాయి. ప్రస్తుతం మహేష్‌తో సర్కారు వారి పాట సినిమాలో చేస్తుంది. దాని తరువాత పవర్ స్టార్‌తో మరో సినిమా చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమా ఇంకా చర్చల దశలో ఉందట. ఈ టైంలో వివాహానికి సిద్దంగా లేనని, పెళ్లి చేసుకుంటానని కాకపోతే కాస్త టైం కావాలని తల్లిదండ్రులకు చెప్పేసిందట.

Related posts