telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

ట్రయల్స్‌ విజయవంతం..మూడు నెలల్లో వ్యాక్సిన్‌: అమెరికా సంస్థ

Corona Virus Vaccine

కరోనా వ్యాక్సిన్‌ కోసం ప్రపంచ దేశాలు ప్రయోగాలను ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన మోడెర్నా, ఫైజర్ సంస్థలు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడంలో మెరుగైన ఫలితాలు సాధిస్తున్నాయి. మరో మూడు నెలల్లో వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకురానున్నాయి. ఆయా సంస్థలు అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ల మానవ పరీక్షలు తుదిదశకు చేరుకున్నాయి.

తాము అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ విజయవంతమైతే ఈ ఏడాది అక్టోబర్‌ నాటికి రెగ్యులేటరీ అనుమతులు పొంది ఈ ఏడాది చివరినాటికి 5 కోట్ల మందికి రెండేసి డోసుల వ్యాక్సిన్లను సరఫరా చేస్తామని ఫైజర్ సంస్థ తెలిపింది. ఈ ఏడాది నవంబర్‌ నాటికే తమ వ్యాక్సిన్‌ సరఫరా ప్రారంభమవుతుందని స్పష్టతనిచ్చింది. వచ్చే ఏడాది చివరినాటికి మొత్తం130 కోట్ల వ్యాక్సిన్‌ డోసుల సరఫరా చేయడానికి ఫైజర్‌ ప్రణాళికలు సిద్దం చేస్తోంది.

Related posts