telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

దేశ విద్యా వ్యవస్థకు ఆంధ్ర యూనివర్సిటీ విశేష కృషి: హరిచందన్

biswabhusan harichandan governor

దేశ విద్యా వ్యవస్థకు ఆంధ్ర విశ్వ విద్యాయలం విశేష కృషి చేసిందని ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కొనియాడారు. ఏయూలోని వైవీఎస్ ఆడిటోరియంలో విద్యార్థులను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. విద్యాభివృద్ధికి ప్రభుత్వం తీసుకునే విధానాలు సానుకూలంగా ఉన్నాయని చెప్పారు. విద్యాభివృద్ధి దేశ స్థితి గతులను పూర్తిగా మార్చి వేయగలదనే నమ్మకం ఉందన్నారు. పరిశోధనా అభివృద్ధి కార్యక్రమాలకు విశ్వవిద్యాలయాలు పెద్దపీట వేయాలని సూచించారు.

దేశ రాజధాని ఢిల్లీలో కూడా కాలుష్యం విపరీతంగా ఉందని గవర్నర్‌ పేర్కొన్నారు. విశాఖలో కూడా కాలుష్యం ఎక్కువగా ఉందని, అందరూ కలిసి కాలుష్యాన్ని తగ్గించేందుకు కృషి చేయాలన్నారు. రోజురోజుకూ నీటి కాలుష్యం, వాయు కాలుష్యం పెరుగుతోందనీ, పర్యావరణ పరిరక్షణకు అందరు పాటు పడాలన్నారు. విశ్వ విద్యాలయాలు మొక్కల పెంపకానికి నడుం కట్టాలని గవర్నర్‌ బిశ్వ భూషణ్‌ పిలుపునిచ్చారు.

Related posts