భరత్ కమ్మ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం “డియర్ కామ్రేడ్”. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ పతాకాలపై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్ చెరుకూరి, యష్ రంగినేని నిర్మించారు. జూలై 26న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదలైన “డియర్ కామ్రేడ్” చిత్రంలో విలన్ పాత్రను రాజ్ అర్జున్ అనే బాలీవుడ్ నటుడు పోషించారు. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్‌ఖాన్ నటించిన ‘సీక్రెట్ సూపర్‌స్టార్’ సినిమాలో రాజ్ అర్జున్ విలన్ పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఆ పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో డియర్ కామ్రేడ్‌లో అవకాశం వచ్చింది. అయితే “డియర్ కామ్రేడ్” సినిమా క్లైమాక్స్‌లో అర్జున్‌ను హీరోయిన్ రష్మిక కసితీరా కొడుతుంది. ఈ విషయంపై తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అర్జున్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. “సినిమా క్లయిమ్యాక్స్‌లో రష్మిక మీ చెంప చెల్లుమనిపించినప్పుడు మీ రియాక్షన్ ఏమిటి?’ అన్న ప్రశ్నకు ‘‘నేను చాలా హ్యాపీగా ఫీలయ్యా. ఎందుకంటే సినిమాలో కొన్ని కొన్ని సీన్స్‌లో రష్మికను నేను చాలా ఇబ్బంది పెట్టా. ఆమెను చాలా టార్చర్ కూడా పెట్టాను. నటనలో భాగంగానే మెంటల్‌గా, ఫిజికల్‌గా తనను అలా ఇబ్బంది పెట్టాను. తను సీన్ అయిపోయాక కూడా అరగంట వరకు ఏడ్చేది. నేను మళ్ళీ తన దగ్గరకు వెళ్ళి చాలా సేపు మంచిగా మాట్లాడేవాణ్ణి. ‘అవి కేవలం సీన్స్ మాత్రమే.. నువు బాధపడివుంటే నన్ను క్షమించు. బాధపడొద్దు అని చెప్పేవాణ్ని.’ ఆఖరికి తను నన్ను కొట్టినప్పుడు చాలా ఆనందపడ్డాను. హమ్మయ్య.. తన కోపం అంతా పోయింది కదా అని. ఎక్కడా కూడా ఒక విలన్, హీరో, హీరోయిన్ ఫ్రెండ్స్ అవ్వరు. కానీ ఈ సినిమాతో మేం ముగ్గురం మంచి ఫ్రెండ్స్ అయ్యాం. విజయ్, రష్మిక నాకు చాలా మంచి ఫ్రెండ్స్ అయ్యారు” అని తెలిపారు.
సునీత ఆరోపణలపై స్పందించిన బన్నీ వాసు