ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన భారీ చిత్రం సాహో”. భారీ అంచనాలతో ఆగస్టు 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రం డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ బాగానే వసూళ్లను రాబట్టింది. ఇక ప్రభాస్ తన 20వ చిత్రంగా కె కె రాధా కృష్ణ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని గోపికృష్ణ మూవీస్, యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం 1970 బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో రూపొందుతున్నట్టు సమాచారం. చిత్రానికి “జాన్” అనే టైటిల్ ను ఖరారు చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇందులో ప్రభాస్ హస్తసాముద్రికం విద్య తెలిసిన వ్యక్తి పాత్రలో కనిపించబోతున్నారు. ఇదివరకే కొంతభాగం చిత్రీకరణ జరిపారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్‌ను తిరిగి ఆరంభించినట్లు తెలిసింది. చిత్రీకరణ కోసం ప్రభాస్ ఇటీవలే పారిస్ వెళ్లాడని చెబుతున్నారు. తన బృందంతో కలిసి ఎయిర్‌పోర్ట్ నుంచి పారిస్‌కు బయలుదేరుతున్న ప్రభాస్ వీడియో ఒకటి సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఏకకాలంలో రూపొందిస్తున్నారు. అతి త్వరలోనే చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల కానుందని అంటున్నారు.
చరణ్ పై మంచు లక్ష్మీ ఆసక్తికర ట్వీట్