telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సునీత ఆరోపణలపై స్పందించిన బన్నీ వాసు

Bunny

ఆర్టిస్ట్ సునీత బోయ బ‌న్నీ వాసు తనను మోసం చేశాడని పేర్కొంటూ తీవ్ర ఆందోళన చేసిన సంగ‌తి తెలిసిందే. అంతకుముందు సునీత బోయ… తనకు మానసిక రోగం ఉందంటూ కొంద‌రు ప్రచారం చేస్తున్నారు. అది అబద్ధం, మెగా ప్రొడ్యుసర్ బన్నీ వాసు తనను మోసం చేయడం వల్లే తాను ఫిల్మ్ ఛాంబర్ వద్ద నిరసన తెలిపానని.. ఇందులో పవన్ కళ్యాణ్‌కు జనసేనకు సంబంధం లేదు . నేను పాపులారిటీ కోసం ఇది చేయడం లేదు. నాకు ఇండస్ట్రీలో ఎంతమంది నరకం చూపించారో త్వ‌ర‌లోనే చెబుతాను. అల్లు అరవింద్ పెద్దవారు కాబట్టి వాళ్లపై ఆరోపణలు చేయడానికి కారణాలు డీఎస్పీకి చెబుతాను . నన్ను నెలరోజులుగా బన్నీ వాసుతో పాటు ఇద్దరు ముగ్గురు ఇండస్ట్రీ వ్యక్తులు టార్చర్ పెట్టారు. వీరి అరాచకాలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లడం కోసమే నేను పోరాటం చేస్తున్నా అని ఫేస్ బుక్ వీడియోలో తెలిపింది జూనియర్ ఆర్టిస్ట్ సునీత బోయ.

ఈ వివాదంకి సంబంధించి కొద్ది రోజులుగా మీడియాలో ప‌లు క‌థ‌నాలు వ‌స్తున్నాయి. ప‌లు టీవీ ఛానెల్స్‌కి వెళ్ళి కూడా సునీత త‌న ఆవేద‌న‌ని వెళ్ళ‌గ‌క్కింది. వివాదం ముదురుతున్న క్ర‌మంలో ప్ర‌ముఖ నిర్మాత బ‌న్నీ వాసు వీడియో ద్వారా స్పందించారు. “త‌నకి సినిమా అవ‌కాశం ఇవ్వ‌లేద‌ని మేం చెప్ప‌లేదు. ఆడిష‌న్స్‌లో పాల్గోవాల‌ని, అక్క‌డ ఓకే అయితే మంచి క్యారెక్ట‌ర్ వ‌స్తుంద‌ని చెప్పాం. అయితే తాను ఆఫీసు ముందు అల్ల‌రి చేయ‌డం, చ‌నిపోతాన‌ని బెదిరించ‌డం ఇలాంటివి మ‌మ్మ‌ల్ని చాలా బాధించాయి. సినిమాలో న‌టించాలంటే క్యారెక్ట‌ర్ చాలా ముఖ్యం. ల‌క్ష‌లు పెట్టి సినిమాలు తీస్తున్న‌ప్పుడు ఏదన్న ఒక వివాదం వ‌ల‌న సినిమా ఆగిందంటే చాలా న‌ష్ట‌పోతాము. ద‌య‌చేసి మీడియా మిత్రులు కూడా జ‌రిగిన విష‌యాన్ని అర్ధం చేసుకోండి” అని బ‌న్నీ వాసు వీడియోలో పేర్కొన్నారు.

Related posts