telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రూట్‌ మార్చిన హెబ్బా…

సినిమా అవకాశాలు పెద్దగా లేకపోయినా హెబ్బా పటేల్ మాత్రం ఎక్కడా తగ్గడమేలేదు. తన అందానికి గట్టిగానే పని చెప్పింది. ఘాటు కుర్రోళ్ళను ఎక్కడ కెలికితే కిర్రెక్కుతుందో బాగా తెలిసిన సొగసరి మరి. అందుకే హాట్ ఫోజులతో సోషల్ మీడియాలో తెగ రెచ్చిపోతోంది. హెబ్బా పటేల్ ఫోజులు కుర్రకారుకు ఖుషీగా ఉన్నాయట. కుమారి 21ఎఫ్ సినిమాతో ఈ అమ్మడికి అవకాశాలు అమ్మడికి వరుస కట్టాయి. అప్పటి నుంచి వరుసగా బోల్డ్ పాత్రలతో అందరినీ ఆకట్టుకున్నారు. కానీ ఆ తర్వాత హెబ్బాకు అవకాశాలు సన్నగిల్లాయి. కొంతకాలం క్రితం అయితే హెబ్బా కనుమరుగు అయిపోయే పరిస్థితులు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు మళ్లీ అమ్మడు పుంజుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సరికొత్త కథలను ఎంచుకుంటూ మళ్లీ అందరినీ మెప్పించేందుకు సిద్దమయ్యారు. ఈ ప్రయత్నంలో భాగంగా హెబ్బా తాజాగా నటించిన సినిమా ‘తెలిసిన వాళ్లు’. ఈ సినిమా ఫస్ట్ లుక్ తాజాగా విడుదల చేశారు. ఈ ఫస్ట్‌లుక్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇందులో పాత కాలపు కుర్చిలో ఓ అమ్మాయి కుర్చిని ఉన్నారు. కానీ అమ్మాయికి తల లేదు. తల అక్కడ గోడపైన ఉన్న ఫోటోలో ఉంటుంది. ఆ తల హెబ్బా పటేల్‌ది. ఈ ఫస్ట్‌లుక్ చూస్తుంటేనే ఈ సినిమా హర్రర్ టచ్ ఉన్న సినిమాగా అర్థం అవుతోంది. ఈ ఫస్ట్ లుక్ సినిమాపై భారీ అంచనాలను కల్పిస్తోంది. మరి ఈ సినిమాతో అయినా హెబ్బా తిరిగి తన ఫామ్ అందుకుంటారేమో చూడాలి.

Related posts