విక్రమ్ హీరోగా అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో నటిస్తున్న తాజా చిత్రం ‘కోబ్రా’.. ‘The King Cobra has Arrived’ అంటూ ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ఏడు డిఫరెంట్ గెటప్స్‌లో కనబడి సర్‌ప్రైజ్ చేసాడు చియాన్.. ఇంతకుముందెన్నడూ కనిపించని సరికొత్త గెటప్స్‌లో ‘కోబ్రా’లో కనిపిస్తున్నాడు. విక్రమ్ సరసన ‘కేజీఎఫ్’ భామ శ్రీనిధి శెట్టి కథానాయిక కాగా ప్రముఖ మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పటాన్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఏ ఆర్ రెహమాన్ సంగీతమందిస్తున్నారు. అయితే…. తాజాగా ఈ సినిమా నుంచి విక్రమ్ మరో లుక్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ ఫోటోలో పొడవాటి గజి బిజీ జుట్టుతో కనిపిస్తున్నాడు విక్రమ్. అంతేకాదు ఎన్నో అంకెలు, ఫార్ములాలు అతడి మెదడులో ఉన్నట్లు చూపించారు. ప్రతి సమస్యకూ గణిత పరిష్కారం ఉంటుందని క్యాప్షన్ పెట్టారు. ఈ కొత్త లుక్ విక్రమ్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల కానుంది. అయితే.. ఈ సినిమాపై విక్రమ్ బాగా అంచనాలు పెట్టుకున్నారు.
previous post