భారత్ -బంగ్లాదేశ్ మధ్య నవంబర్ 3న మొదటి టీ 20 మ్యాచ్ ఢిల్లీ లోని అరుణ్ జైట్లీ స్టేడియంలోనే జరుగుతుందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పష్టం చేశాడు. దీపావళి తరువాత ప్రస్తుతం ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాద కర స్థాయికి చేరుకుంది. దాంతో మ్యాచ్ ను వేరే చోటికి తరలించాలని పర్యావరణ వేత్తలు గంగూలీకి లేఖ రాశారు. ఓ సారి షెడ్యూల్ ఫిక్స్ చేశాక చివరి నిమిషంలో మ్యాచ్ ను రద్దు చేయలేం. గ్రౌండ్ సిబ్బంది తో మాట్లాడం జరిగింది. సూర్యడు ఉదయిస్తే మ్యాచ్ కు ఎలాంటి ఆటంకం ఉండదని వారు హామీ ఇచ్చారు. సో మ్యాచ్ ను అక్కడే జరుపాలని నిర్ణయించాం.
ఉత్తరాదిన దీపావళి తరువాత వాతావరణం కఠినంగా ఉంటుందని అయితే దాని వల్ల మ్యాచ్ కు ఆటకం ఉండదని గంగూలీ వెల్లడించాడు. బంగ్లా స్టార్ అల్ రౌండర్, టీ 20, టెస్ట్ కెప్టెన్ షకిబుల్ హాసన్ నిషేధం తో భారత పర్యటనకు దూరం కావడంతో అతని స్థానం లో టీ 20కి మహమ్మదుల్లాను అలాగే టెస్ట్ జట్టుకు మోమినల్ హాక్ ను సారథులుగా నియమించింది బంగ్లా క్రికెట్ బోర్డు.